amp pages | Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోకి అలియా ఆగయా

Published on Mon, 12/07/2020 - 00:24

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలోకి బాలీవుడ్‌ భామ అలియా భట్‌ అడుగు పెట్టారు. సోమవారం హైదరాబాద్‌కు చేరుకొని రాజమౌళిని కలిశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ అలియా, రాజమౌళికి చెందిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్‌గా మారాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి సెట్‌లోకి అలియా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలు అందుకుంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో భాగం కానున్నారు. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో వైరల్‌

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ కనిపిస్తారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆలియా. ‘‘ఫైనల్‌గా... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నానోచ్‌’’ అంటూ ముంబై నుంచి హైదరాబాద్‌ ప్రయాణంలో సెల్ఫీ పోస్ట్‌ చేశారామె. సినిమాలో తెలుగు డైలాగ్స్‌ పలికేందుకు శిక్షణ తీసుకున్నారు ఆలియా. ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్, శ్రియ, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్‌ కెమెరామేన్‌. ఈ సినిమా చిత్రీకరణ మార్చికల్లా పూర్తవుతుందని సమాచారం.

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?