amp pages | Sakshi

హాట్‌టాపిక్‌గా బాలయ్య కొత్త మూవీ రూమర్‌, ఇది నిజమా?

Published on Sat, 02/19/2022 - 21:34

Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్‌ డైరెక్షన్‌లో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.  ‘వేటపాలెం’లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను తయారు చేసుకున్నట్టుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: Bheemla Nayak OTT Streaming: కళ్లు చెదిరే డీల్‌కు ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 2 సంస్థలు!

అంతేకాదు ఈ కథ కోసం ఆయన 'వేటపాలెం' వెళ్లి అక్కడ పాత న్యూస్ పేపర్ల నుంచి కొంత సమాచారాన్ని సేకరించాడని కూడా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలోనే ఆయన ఈ కథను నడిపించనున్నట్టు చెప్పుకున్నారు. అయితే ఈ తాజా బజ్‌ ప్రకారం నిన్న షూటింగు మొదలైన తరువాత, ఇది ఒక కన్నడ సినిమాకి రీమేక్ అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు.

చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్‌ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీనికి బాలయ్య సినిమా రీమేక్ అని చెప్పుకుంటున్నారు. దీంతో బాలయ్య రీమేక్‌ సినిమాలో నటిస్తున్నారంటూ ఈ విషయం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరి దర్శకుడు గోపీచంద్ మలినేని దీనిపై ఎలా స్పందిస్తారలో చూడాలి. కాగా రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)