amp pages | Sakshi

హైటెక్‌ సిటీలో ఘనంగా బంగార్రాజు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Published on Thu, 01/13/2022 - 13:45

‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్‌. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

కేవలం మూవీ యూనిట్, నటీనటుల మధ్య నిరాండంబరంగా మ్యూజికల్‌ హిట్‌ ఈవెంట్‌ను జరుపుకున్న ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కరోనా నేపథ్యంలో సందిగ్ధంలో పడింది. ఈ వేడుకను ఫ్యాన్స్‌ మధ్య గ్రాండ్‌గా జరపాలని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. అయితే కోవిడ్‌ ప్రొటోకాల్‌ నిబంధనల నేపథ్యంలో ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుందా లేదా అనేది అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ జరగనుందంటూ అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రెయాస్‌ మీడియా తాజాగా స్పష్టం చేసింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం బంగార్రాజు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహుర్తం ఖరారైందని పేర్కొంది.

హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా సంక్రాంతి బరి నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలు తప్పుకోవడంతో, 'బంగార్రాజు' పెద్ద సినిమాగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సంక్రాంతి పండగతో కూడిన కథ కావడం.. ఇందుకు సంబంధించిన అంశాలు కలిగి ఉండటంతో ఈ సినిమాకి కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో చైతూలోని రొమాంటిక్ యాంగిల్‌ను దర్శకుడు పరిచయం చేయబోతున్నాడు.

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)