amp pages | Sakshi

నటుడిగా నేను సక్సెస్‌ అయ్యా: బెల్లంకొండ గణేశ్‌

Published on Wed, 05/31/2023 - 18:34

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా రంగప్రవేశం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో  హీరో బెల్లంకొండ గణేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

నేను ఎప్పుడూ స్టూడెంట్‌లానే ఫీలవుతాను. రియల్ లైఫ్‌లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము.

ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను.

ఈ పాత్ర నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది. 

భాగ్యశ్రీ మా అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకున్నాం.

నాందితో మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పని చేశారు. అందరికంటే ముందు సెట్‌కు వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.

స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమకంతో నిర్మాతలు ఆ డేట్‌కు విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. అయితే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.

మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)