amp pages | Sakshi

బిగ్‌బాస్‌: అర‌గుండుకు మాస్ట‌ర్ ఒప్పుకుంటాడా?

Published on Wed, 10/14/2020 - 15:42

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఆరో వారం ఇంటి స‌భ్యులు తొలిసారి టీమ్ వర్క్‌లో ఐక‌మ‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంత‌కు ముందు ఇచ్చిన టాస్క్‌ల‌లో టీమ్స్‌గా విడ‌గొట్టినా వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రి ఆట వారు ఆడ‌టానికే ఇష్ట‌ప‌డేవారు. కానీ ఈసారి మాత్రం టీమ్ కోసం ఎంత క‌ష్ట‌మైనా స‌రే త్యాగాలు చేసేందుకు సిద్ధ‌ప‌డుతుండ‌టం విశేషం. కాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా వారిని బ్లూ, రెడ్ టీమ్‌లుగా విడ‌గొట్టాడు. బ్లూ టీమ్‌లో హారిక జుట్టు క‌త్తిరించుకోగా, కుమార్ బ‌ట్ట‌లు చింపుకోవ‌డంతో పాటు ఎక్కువ సేపు ఇసుక బ‌స్తాను గాలిలో నిలిపాడు. (చ‌ద‌వండి: అరియానా క‌ళ్ల‌కు కాటుక రుద్దిన అవినాష్‌)

రెడ్ టీమ్‌లో అభిజిత్ త‌నకు సంబంధించిన అన్ని వ‌స్తువుల‌ను పంపించేయ‌గా, లాస్య ఓ డ్రింక్‌ను తాగింది.మోనాల్ జ‌న‌ప‌నార బ‌ట్ట‌ల‌ను ధ‌రించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రెండు టీమ్‌లు చెరో మూడు డీల్స్ పూర్తి చేశాయి. నేడు బిగ్‌బాస్ వారికి మ‌రిన్ని డీల్స్ ఇవ్వ‌నున్నాడు. అందులో భాగంగా.. ఒక‌రు త‌ల‌, గ‌డ్డం స‌గం షేవింగ్ చేసుకోవాల‌ని చెప్పాడు. ఇందుకు అమ్మ రాజ‌శేఖ‌ర్ తాను సిద్ధ‌మంటూ ముందుకు వ‌చ్చాడు. కానీ అత‌నికి జుట్టు అంటే చాలా ఇష్ట‌మ‌ని రెడ్ టీమ్ గుస‌గుస‌లు పెడుతోంది. ఇక సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం బ్లూ టీమ్ విజ‌యం సాధించ‌గా నోయ‌ల్ రెండోసారి కెప్టెన్ అయ్యాడట‌. మ‌రి ఇదెంత వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే. (చ‌ద‌వండి: ట్ర‌యాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తున్న అభి!)

Videos

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?