amp pages | Sakshi

బిగ్‌బాస్‌: సూర్య ‌కిర‌ణ్‌తో దివి ఫైట్‌!

Published on Thu, 09/10/2020 - 17:09

బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు ప్రారంభం కాక‌ముందే గొడ‌వ‌లు, ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేటి నుంచి బిగ్‌బాస్ శారీర‌క టాస్క్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాడు. ఇందుకోసం కంటెస్టెంట్లను టీమ్స్‌గా ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒకరినొక‌రు తోసుకుంటూ మొద‌టి టాస్క్‌లోనే కంటెస్టెంట్లు త‌మ ప్ర‌తాపం చూపించిన‌ట్లు కనిపిస్తోంది. ఈ మేర‌కు స్టార్ మా ప్రోమోను విడుద‌ల చేసింది. ఈ టాస్క్‌లో పాల్గొన్న ఇంటి స‌భ్యులు చేతుల‌తోనే ట‌మాటాలు పిసికి జ్యూస్ చేశారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు ఎక్కువ బాటిళ్లు నింపాల‌ని త‌హ‌త‌హ‌లాడారు. అయితే ఈ టాస్క్‌లో గంగ‌వ్వ ఎక్క‌డా పాల్గొన్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఆమె ప్ర‌త్యేకమ‌ని నాగార్జునే చెప్పాడు కాబ‌ట్టి బిగ్‌బాస్ కూడా ఈ టాస్క్‌లో ఆమెకు మిన‌హాయింపు ఇచ్చారో, లేదా ఆడించారో నేటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: 'అత‌ను‌ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిది')

ఇదిలా వుంటే స్టార్ మా విడుద‌ల చేసిన మ‌రో ప్రోమోలో దివి, సూర్య కిర‌ణ్ మ‌ధ్య గొడ‌వ మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో త‌ను కంటెస్టెంట్ల‌ను ఏ మేర‌కు ప‌రిశీలించో చెప్పుకొచ్చింది. మోనాల్‌.. ఊరికే ఏడుస్తుంద‌ని, లాస్య సెన్సిటివ్ అని చెప్పింది. సూర్య‌.. నా మాటే విను అన‌డం త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికింది. దీంతో సూర్య కిర‌ణ్ కోపం న‌షాళాన్ని తాకింది. తాను త‌గ్గించుకోన‌ని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌లో మ‌రోసారి అగ్గి రాజేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ ప్రోమోతో దివి మౌనం వెన‌క ప‌ర‌మార్థాల‌ను వెలికి తీస్తున్నారు నెటిజ‌న్లు. ఆమె ఇన్ని రోజులు మౌనం వహించ‌డం.. త‌న స్ట్రాట‌జీలో భాగ‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగ‌తా కంటెస్టెంట్ల‌ను నిశ్శ‌బ్ధంగా గ‌మ‌నించి ఆ త‌ర్వాత త‌న అస‌లు సిసలైన‌ ఆట మొద‌లుపెట్టే స‌మ‌యం కోసం వేచి చూస్తోంద‌ని అంటున్నారు. అయితే దివి త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించ‌డం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగమేన‌ని తెలుస్తోంది. అస‌లు దివికి, సూర్య‌కిర‌ణ్‌కు మ‌ధ్య నిజంగానే గొడ‌వ జ‌రిగిందా? లేదా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. (చ‌ద‌వండి: ఆర్జీవీ మెచ్చిన యాంకర్‌ అరియానా)

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?