amp pages | Sakshi

అరియానాకు చుక్క‌లు చూపిస్తున్న సోహైల్‌

Published on Mon, 12/07/2020 - 15:51

చూస్తుండ‌గానే బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభ‌మై ప‌ద‌మూడు వారాలు గ‌డిచిపోయాయి. గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాలే మిగిలే ఉన్నాయి. ట్రోఫీ అందుకోవాల‌న్న క‌సితో కంటెస్టెంట్లు ఆట మీద విరుచుకుప‌డుతున్నారు. ఎమోష‌న్స్‌, గేమ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆడుతున్నారు. మ‌రోవైపు అఖిల్ ఇప్ప‌టికే నేరుగా ఫినాలేకు చేరుకుని గుండెల మీద చెయ్యేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేష‌న్‌లో ఉండ‌నున్నారు. ఇదే చివ‌రి నామినేష‌న్ అని స్ప‌ష్టం చేస్తూ బిగ్‌బాస్ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో గార్డెన్ ఏరియాలో ఉన్న కిరీటాన్ని సోహైల్‌ ద‌క్కించుకుని హౌస్‌కు రాజుగా అవ‌తరించాడు. ఆయ‌న ఆజ్ఞ ప్ర‌కార‌మే మిగ‌తా ఇంటి స‌భ్యులు న‌డుచుకోవాల్సి ఉంటుంది. లేక లేక వ‌చ్చిన అవ‌కాశాన్ని సోహైల్ వ‌దులుకుంటాడా? అరియానాకు బండెడు ప‌నులు అప్ప‌గిస్తూ ఆమెకు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఇది గ‌మ‌నించిన అభిజిత్ మ‌హారాజా, ఇది ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న అవ‌కాశం క‌దా! అంటూ పంచ్ వేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్‌)

త‌ర్వాత సింహాస‌నాన్ని అధిష్టించిన రాజు అరియానా త‌ప్పొప్పుల‌ గురించి చ‌ర్చిస్తూ ఆమెకు శిక్ష‌లు విధిస్తున్నాడు. రాక్ష‌సుల టాస్క్‌లో అరియానా ఎంత రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించింది? అని మండిప‌డ్డాడు. ఆమె మీద నీళ్లు గుమ్మ‌రిస్తూ, గుడ్డు ప‌గ‌ల‌గొడుతూ చిత్ర‌హింస‌లు పెట్టాడు. అయితే అరియానా నేను కూడా రాణయ్యే అవ‌కాశం ఉంద‌ని గుర్తు చేయ‌డంతో అమ్మో, నాకు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తోంది అని సోహైల్ గుడ్లు తేలేశాడు. మొత్తానికి ఈ ప్రోమోలో టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగా హైలెట్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు మ‌రో రెండు వారాలైతే వీళ్ల‌ అల్ల‌రిని మిస్స‌వుతామ‌ని బాధ‌తో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప‌ద్నాలుగో వారం నామినేష‌న్‌లో ముగ్గుర‌మ్మాయిలు హారిక‌, మోనాల్‌. అరియానా డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌నున్నారు. వీళ్ల‌లో నుంచి ఒక‌రు ఎలిమినేట్ అయ్యేందుకు అవ‌కాశ‌ముంది. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అరియానా బెస్ట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో బిగ్‌బాస్‌ ఆమెకు ఏదైనా స్పెష‌ల్ ఆఫ‌ర్ ఇస్తాడేమో చూడాలి! (చ‌ద‌వండి: న‌న్ను పంపించినా డోంట్ కేర్‌: అరియానా)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌