amp pages | Sakshi

బిగ్‌బాస్‌: మెహ‌బూబ్ ఎలిమినేటెడ్‌!

Published on Sat, 11/14/2020 - 20:49

ప‌దోవారం ముగింపులోకి వ‌చ్చిన బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టికే ప‌ది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. సూర్య‌కిర‌ణ్‌, క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, సుజాత‌, కుమార్ సాయి, దివి, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ‌, నోయ‌ల్ స్వ‌తంత్రంగా హౌస్‌ను వీడి వ‌చ్చేశారు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ప‌క్క‌న పెట్టి అస‌లు ఎలిమినేష‌న్ ఉంటుందా?  లేదా? అని అంద‌రూ అయోమ‌యంలో ప‌డిపోయారు.

నామినేష‌న్‌లోకి వ‌చ్చి బుక్క‌య్యాడు
కానీ తాజాగా లీకువీరులు చెప్తున్న స‌మాచారం ప్ర‌కారం ఎలిమినేష‌న్ ఎత్తేయ‌లేదు. దీపావ‌ళి పండ‌గ‌ను సాకుగా చెప్తూ అంద‌రినీ సేఫ్ చేయ‌లేదు. ముందు నుంచి ఊహిస్తున్నదాని ప్ర‌కారం మెహ‌బూబే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడ‌ని వినికిడి. నిజానికి ఎప్పుడో బ్యాగు స‌ర్దేయాల్సింది. కానీ అదృష్టం బాగుండి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు నామినేష‌న్‌లోకి వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యాడు. నామినేష‌న్‌లో ఉన్న‌వాళ్ల‌లో అరియానా మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ మెహ‌బూబ్ మీద అంత‌క‌న్నా ఎక్కువే ఉండ‌టంతో అత‌డికి పెద్ద‌గా ఓట్లు కుర‌వలేదు. (చ‌ద‌వండి: మాస్ట‌ర్ అవుట్‌: మెహ‌బూబ్‌కు కెప్టెన్సీ, కానీ!)

రోబో టాస్కు నుంచి మెహ‌బూబ్‌పై వ్య‌తిరేక‌త‌
ఇక్క‌డ చిత్ర‌మేమిటంటే హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే మెహ‌బూబ్ స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌. ఫిజిక‌ల్ టాస్కులో ఇర‌గ‌దీస్తాడు. మిగ‌తావాళ్ల‌కు గెలిచే అవ‌కాశాన్నే ఇవ్వ‌డు. అయితే అత‌డికి కండ‌బ‌లం ఉంది కానీ బుద్ధిబ‌లం కాస్త త‌క్కువ‌. దాని ప్ర‌తిఫ‌లంగా కాయిన్ల టాస్కులో గెలిచే అవ‌కాశాన్ని కాలితో త‌న్నేశాడు. టాస్కుల్లో త‌ప్పితే సాధార‌ణ స‌మ‌యాల్లో అత‌డికి ఎక్కువ‌గా స్క్రీన్ స్పేస్ కూడా ల‌భించ‌లేదు. త‌న జిగిరీ దోస్త్ సోహైల్‌తో స్నేహం త‌ప్ప ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఏం చేయాల‌న్నదానిపై పెద్ద‌గా  దృష్టి పెట్ట‌లేదు. ఇక రోబో టాస్కులో అతిగా ఆవేశ‌పడి మొద‌ట్లోనే వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నాడు. త‌ర్వాత టాస్కులు ఆడుతూ త‌న గ్రాఫ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేసినా వీక్ష‌కుల్లో మాత్రం మెహ‌బూబ్‌పై ఆ వ్య‌తిరేక‌త అలాగే ఉండిపోయింది. ఫ‌లితంగా ఈ వారం ఎలిమినేట్ అవ‌క త‌ప్ప‌లేన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యాన్ని నాగార్జున రేప‌టి ఎపిసోడ్‌లో అధికారికంగా ప్ర‌క‌టిస్తారా? లేదా ఏమైనా ట్విస్టులిస్తారా? అనేది చూడాలి. (చ‌ద‌వండి: లాఠీల‌తో కొట్టి స్టేష‌న్‌లో వేశారు: మెహ‌బూబ్‌)

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)