amp pages | Sakshi

ఆపరేషన్‌ థియేటర్‌లో బిగ్‌బాస్‌ ప్రియాంక.. ఏమైందంటే?

Published on Sun, 01/07/2024 - 15:59

సీరియల్‌ ద్వారా బోలెడంత ఫేమ్‌ సంపాదించుకుంది ప్రియాంక జైన్‌. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్‌ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్‌ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్‌ జరిగిందంటూ శివకుమార్‌ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.

ఏడో తరగతిలో సైట్‌..
'ప్రియాంక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్‌ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్‌ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్‌ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్‌ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది.

కంటి ఆపరేషన్‌ సక్సెస్‌
తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్‌ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్‌ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్‌గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక.

చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్‌ శవం

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)