amp pages | Sakshi

బిగ్‌బాస్ 7: తొమ్మిది వారాల‌కు తేజ ఎంత సంపాదించాడంటే?

Published on Sun, 11/05/2023 - 22:17

టేస్టీ తేజ‌.. పేరుకు త‌గ్గ‌ట్లే భోజ‌న ప్రియుడు.. కాదు కాదు, భోజ‌న ప్రియుడు కాబ‌ట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ త‌న పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగ‌త‌నం చేస్తూ, స్ప్రైట్‌ల కోసం క‌క్కుర్తి ప‌డేవాడు. ఈ పోరాటం ఏదో ఆట‌లో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజ‌ను చూసి జ‌నాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అత‌డిని బిగ్‌బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించారు.

గొప్ప‌గా ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ..
నిజానికి తేజ మ‌రీ తొమ్మిది వారాల‌దాకా ఉంటాన‌ని అనుకోలేద‌ట‌. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడ‌ట‌. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్ష‌కులు త‌న‌ను హౌస్‌లో ఉంచ‌డంతో త‌న‌ను త‌నే న‌మ్మ‌లేక‌పోతున్నాడు. నిజంగానే తేజ గొప్ప‌గా ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ క‌డుపుబ్బా న‌వ్వించాడు. అంద‌రితోనూ క‌లుపుగోలుగా ఉన్నాడు. చిన్న‌పాటి గొడ‌వ‌లు జ‌రిగినా స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం త‌న‌ది. అదే స‌మ‌యంలో పుల్ల‌లు పెట్టి అంద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టే నార‌దుడు కూడా!

భ‌లే సేఫ్‌గా ఆడేవాడు..
ఒక‌రి మాట‌ను మరొక‌రికి చెప్పి వాళ్ల మ‌ధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవ‌త‌లి వారు ఏమీ అన‌క‌పోయినా నిన్నిలా అన్నారు, ఆ మాట‌న్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్క‌య్యాడు కూడా! నామినేష‌న్స్‌లోనూ భ‌లే సేఫ్‌గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించ‌కుండా త‌ను డేంజ‌ర్ జోన్‌లోకి రాకుండా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను నామినేష‌న్స్‌లోకి పంపించేవాడు.

రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?
అలా అత‌డు నామినేట్ చేసిన‌వాళ్లు కొంద‌రు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేష‌న్ క‌త్తికి బ‌లైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న అత‌డు బాగానే వెన‌కేశాడు. వారానికి దాదాపు రూ.1.75 ల‌క్ష‌ల మేర తీసుకున్నాడ‌ట‌. ఈ లెక్క‌న తొమ్మిది వారాల‌కుగానూ రూ.15 లక్ష‌ల పైనే వెన‌కేసిన‌ట్లు తెలుస్తోంది.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)