amp pages | Sakshi

Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ

Published on Sat, 12/23/2023 - 18:48

బిగ్‌బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్‌ని ఎందుకు జైల్లో పెట్టారు?

(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)

తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్‌బాస్ షోలో కామన్‌మ్యాన్ అనే ట్యాగ్‪‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు.

అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌.. ఫ్యాన్స్‌ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్‌గానే ప్రశాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు.

(ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి)

Videos

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)