amp pages | Sakshi

నాన్న జేబులో డబ్బులు కొట్టేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయా: ప్రియాంక

Published on Sat, 10/23/2021 - 17:47

Bigg Boss Telugu 5 Unseen, Priyanka story: స్మైల్‌ చేయండి, స్టార్ట్‌ చేయండి టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ అంతా వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఆటుపోట్లను పంచుకున్నారు. ఆ అడ్డంకులను దాటి చిరునవ్వుతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన విధానాన్ని వివరించారు. ఈ క్రమంలో ప్రియాంక సింగ్‌ తన జీవితం ఎలా మలుపు తిరిగిందో వివరించింది.

'ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. మా ఊర్లో అందరూ నన్ను తేజు, తేజు అని పిలిచేవారు. పెరిగేకొద్దీ నా జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో మా అమ్మ తిరిగి వచ్చినట్లైంది. పెద్దయ్యేకొద్దీ ఊర్లో నామీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. నా ప్రవర్తనలో మార్పు వస్తోందని నాన్నతో చెప్పేవారు. పల్లెటూర్లో మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అప్పుడు నేను అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ఫిక్సయ్యా! 

మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్‌ 75 రూపాయలు అని తెలిసింది. అమ్మో, అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లాను. అక్కడ దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకుని హైదరాబాద్‌ వచ్చాను. హైదరాబాద్‌కు వచ్చేసరికి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. ఒక రూపాయి కాయిన్‌తో మాదాపూర్‌లో ఉన్న చిన్నక్కకు ఫోన్‌ చేస్తే వాళ్లు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు.

అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది, చేశాను. ఆ తర్వాత అప్పారావు బాబాయి నువ్వు బాగున్నావు, లేడీ గెటప్‌ వేస్తావా? అని అడిగాడు. అమ్మాయిగా కనిపించాలనే కోరిక కూడా తీరుతుందని వెంటనే ఓకే చెప్పాను. అలా ఒక కామెడీ షోలో కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. తేజు టీవీలో కనిపిస్తున్నాడంటూ ఊరంతా ప్రచారం జరిగింది. అలా నా సంపాదన రూ. 300 నుంచి లక్షల్లో ఆర్జించడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చింది పింకీ.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌