amp pages | Sakshi

కత్తితో కసితీరా పొడిచారు! తట్టుకోలేకపోయిన సన్నీ

Published on Thu, 09/30/2021 - 19:00

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అవకాశం రావడం ఒకెత్తైతే ఇక్కడ వాళ్లేంటో ప్రూవ్‌ చేసుకోవడం మరో ఎత్తు. ఇక్కడ వారి ప్రవర్తనను ఒక్కటే పరిశీలనలోకి తీసుకోరు ప్రేక్షకులు. టాస్కుల్లో ఆటతీరు, మిగతా ఇంటిసభ్యులతో వారి ప్రవర్తన.. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓట్లు వేస్తుంటారు. ఇక ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబో, యాంకర్‌ రవి, ప్రియ, కాజల్‌, సిరి హన్మంత్‌, సన్నీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో సన్నీ కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నాడు. శ్వేత, శ్రీరామ్‌, సన్నీ కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడగా వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

దీంతో ప్రియ, లోబో, నటరాజ్‌ మాస్టర్‌, షణ్ముఖ్‌, సిరి సహా పలువురు సన్నీ కెప్టెన్‌ కాకూడదని అతడిని కత్తులతో పొడిచారు. త్వరగా ఆవేశపడతావని ప్రియాంక సింగ్‌ కత్తితో పొడవగా నా ఆవేశం ఇంకా చూడలేదని ఆన్సరిచ్చాడు సన్నీ. ఛాన్స్‌ రాగానే సన్నీని కత్తులతో కసాకసా పొడిచేద్దామనుకున్నానంది కాజల్‌. కానీ అప్పటికే ఎన్నో కత్తులు అతడి నడుముకు కట్టిన బెల్టుకు పొడిచి ఉండటంతో తటపటాయించింది. అయితే లోబో తనకు మద్దతివ్వకుండా ఇలా నేరుగా పొడుస్తాడని ఊహించలేదని సన్నీ మానస్‌ దగ్గర తన బాధను వ్యక్తం చేశాడు. కొందరు ఆడుతున్న సింపథీ గేమ్‌ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో ఇంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు సన్నీ. దీంతో మానస్‌ అతడిని ఓదార్చుతూ.. టాస్కులో ఓడిపోవడం విషయం పక్కన పెడితే ఎవరేంటో తెలిసే అవకాశం వచ్చింది కదా అని ధైర్యం చెప్పాడు.

Videos

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)