amp pages | Sakshi

13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు

Published on Fri, 11/06/2020 - 17:59

2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా అందులో నటించిన వారికి, తీసిన మేకర్స్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచిపోయింది. దర్శకుడు భాస్కర్‌ని బొమ్మరిల్లు భాస్కర్‌గా మార్చింది. నిర్మాత దిల్‌ రాజుకు లాభాల పంట పండించింది. అందరూ ఈ సినిమాను అంతగా ఆధరించారు కాబట్టే తెలుగులోనే కాకుండా ఇతర మూడు భాషల్లో విడుదలై అక్కడ కూడా విజయాలను సాధించింది. తమిళంలో సంతోష్‌ సుబ్రహ్మణ్యంగా విడుదలైన సినిమాలలో జయం రవి సరసన జెనీలియానే కథానాయికగా నటించి తన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది.

ఇంత మంచి సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నిర్మాత బోణీ కపూర్‌ 2007లోనే ఈ చిత్ర రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాడు. అప్పటికి ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టని హర్మాన్‌ భవేజాని హీరోగా పరిచయం చేస్తూ అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో ఇట్స్‌ మై లైఫ్‌ అంటూ బొమ్మరిల్లును హిందీలో రీమేక్‌ చేశాడు. కానీ షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్‌ అవ్వలేదు. కారణం ఏదైనా ఆ సినిమా ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.   (నానికి విలన్‌గా మరో యంగ్‌ హీరో)

అయితే 13 సంవత్సరాల తర్వాత ఇట్స్‌ మై లైఫ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మేకర్స్‌. ఓటీటీలో సినిమాలు రిలీజ్‌ అవ్వడం మొదలైన తర్వాత ఎప్పటి నుంచో విడుదలకు నోచుకోని సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులేయడం మొదలుపెట్టాయి. ఇట్స్‌ మై లైఫ్‌ సినిమాకు కూడా ఇదే మంచి అవకాశం అనుకొని నవంబర్‌ 29న జీ5 యాప్‌లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ పాత్రలో సీనియర్‌ నటుడు నానా పాటేకర్‌ మనల్ని అలరించనున్నారు. హాసిని లాగా జెనీలియా చేసే క్యూట్‌ యాక్టింగ్‌ను మళ్లీ మనం చూడబోతున్నాం.  

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)