amp pages | Sakshi

రజనీ కోసం ఉద్యోగులకు హాఫ్‌ డే లీవ్‌ ప్రకటించిన చెన్నై కంపెనీ

Published on Fri, 11/05/2021 - 17:04

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కండ‌క్టర్ నుంచి ఓ స్టార్‌గా ఎదిగాడు. ఆయన సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే థియేటర్లో ఫ్యాన్స్‌ క్యూ కట్టాల్సిందే. అంతగా అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఆయన తాజాగా ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళికి బాక్సాఫీస్‌ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

చదవండి: పునీత్‌ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో

గ‌తంలో కొన్ని కంపెనీలు ర‌జ‌నీకాంత్ సినిమా చేసేందుకు సెల‌వులు కూడా ప్ర‌క‌టించాయి. ఇప్పుడు అన్నాత్తె సినిమా కోసం చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నవంబర్ 5న అంటే ఈ రోజు తమ ఉద్యోగులకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అన్నాత్తె మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్‏గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో పోషించారు. 

చదవండి: పెద్దన్న మూవీ రివ్యూ

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)