amp pages | Sakshi

నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్‌ 

Published on Thu, 11/05/2020 - 20:41

చెన్నై: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు, గురువారం ఎన్నికల సంఘం వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్‌ చేయించాడంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన విజయ్‌ టీం అవన్నీ వట్టి వందతులేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ మాత్రం.. ‘‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం’’పేరిట పొలిటికల్‌ పార్టీని రిజిస్టర్‌ చేయించినట్లు వెల్లడించడంతో మరోసారి సస్పెన్స్‌ నెలకొంది. విజయ్‌తో ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు చేశారు. 

ఈ క్రమంలో విజయ్‌ పేరిట ఓ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్‌ స్పందన కోరుకుంటున్న వాళ్ల కోసం ఈ అధికారిక ప్రకటన అంటూ పీఆర్‌ఓ రియాజ్‌ అహ్మద్ షేర్‌ చేసిన లేఖలో.. ‘‘మా నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఈరోజు రాజకీయ పార్టీ ప్రారంభించారని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీని వల్ల నా అభిమానులకు, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా. మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. కేవలం మా నాన్న స్థాపించారన్న కారణంగా, ఈ పార్టీలో చేరమని గానీ, పార్టీ కోసం పనిచేయమని గానీ నేను చెప్పదలచుకోలేదు. మనం మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ఉద్యమానికి, పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం పేరిట స్థాపించిన పార్టీ కార్యకలాపాల్లో నా పేరుగానీ, ఫొటోగానీ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోను’ ’అని విజయ్‌ పేర్కొన్నట్లు ఉంది.

తండ్రి తాపత్రయం
తమిళనాట సినీ నటుడు దళపతి విజయ్‌కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి తెలిసిందే. దీంతో తనయుడి చేత రాజకీయ ప్రవేశం చేయించాలని గత కొన్నేళ్లుగా విజయ్‌ తండ్రి, దర్శకుడు  ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తన పేరిట ఉన్న ∙మక్కల్‌ ఇయక్కం ద్వారా సేవ కార్యక్రమాలతో విజయ్‌  ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో  ఇటీవల కాలంగా తెర కెక్కుతున్న విజయ్‌ చిత్రాలన్నీ రాజకీయాల చుట్టు సాగుతుండటంతో ఆయన అభిమానుల్లో రాజకీయ  ఎదురు చూపులు పెరిగాయి.  ఈ పరిస్థితుల్లో  విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం  రాజకీయ పార్టీగా మారుస్తూ ఈసీకి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దరఖాస్తు పెట్టుకోవడం తమిళనాట చర్చకు దారి తీసింది.  ఈ పార్టీకి ప్రధానకార్యదర్శిగా ఎస్‌ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా ఆయన భార్య, విజయ్‌ తల్లి శోభ పేర్లను పొందు పరచి ఉండటంతో రాజకీయ చర్చ మరింతగా  వేడెక్కింది. 

ఇది వ్యక్తిగతం.....
ఎస్‌ఏ చంద్రశేఖర్‌ మీడియా ముందుకు వచ్చారు.  ఈ పార్టీకి విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని వ్యాఖ్యానించారు. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అన్నది నిన్నో, మొన్నో ఏర్పాటు చేసింది కాదని, ఇందులో ఉన్న వారికి గుర్తింపు అన్నది దక్కాలన్న కాంక్షతో రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు తెలిపారు. ఈ  పార్టీలోకి విజయ్‌ చేరుతారా.? అని ప్రశ్నించగా, ఇది ఆయన్నే అడగండి అంటూ  దాట వేశారు. ఈ చర్చ నేపథ్యంలో విజయ్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు.  అలాగే, అనధికారికంగా తన పేరును వాడుకునే హక్కు ఎవరికి లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా,తమిళనాట 2021 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు విశ్వనటుడు కమలహాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం వ్యూహాలకు పదును పెట్టి ఉన్నది. ఇక, రాజకీయాల్లోకి వచ్చేశామన్న ప్రకటన చేసిన దక్షిణ భారత చలన చిత్రసూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ పార్టీ ఏర్పాటులో ఉగిసలాటలో ఉన్న నేపథ్యంలో విజయ్‌ పార్టీ తెర మీదకు రావడం గమనార్హం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)