amp pages | Sakshi

న్యూ ఇయర్‌లో షణ్నూకు బిగ్‌ షాకిచ్చిన దీప్తి సునయన

Published on Sat, 01/01/2022 - 07:37

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు షణ్ముఖ్‌ జశ్వంత్‌, దీప్తి సునయన బ్రేకప్‌ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కొత్త సంవత్సరానికి లవ్‌ బ్రేకప్‌తో స్వాగతం పలికింది. షణ్నుతో తన తెగదెంపుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

'ఎంతో ఆలోచించి, ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.. షణ్ముఖ్‌, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. గత ఐదేళ్లలో మేము సంతోషంగా ఉన్నాం, అదే సమయంలో మాలోని రాక్షసులతో పోరాడాం. ఫైనల్‌గా మీరు కోరుకున్నట్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇది చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ బ్రేకప్‌ సోషల్‌ మీడియాలో కనిపించినంత ఈజీ అయితే కాదు. ఇద్దరం కలిసి ఉండటానికి ప్రయత్నించాం, కానీ జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించాం. మా ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. అందుకే ఇక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుతున్నాను' అని రాసుకొచ్చింది. కొత్త సంవత్సరంలో ఇద్దరూ కలిసిపోతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న షణ్ముఖ్‌.. సిరితో ఎక్కువ కనెక్ట్‌ అ‍య్యాడు. ఫ్రెండ్‌ అంటూనే హగ్గులు, ముద్దుల దాకా వెళ్లాడు. హగ్గులు నచ్చడం లేదని సిరి తల్లి చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ పద్ధతి మార్చుకోలేదు. ఈ వైఖరి దీప్తి సునయనకు కూడా నచ్చలేదట! అందుకే బిగ్‌బాస్‌ షోకు వచ్చినప్పుడు కనీసం సిరిని పలకరించనేలేదు. అయితే ఎన్ని గొడవలు పడ్డా కలిసిపోతామని చెప్తూ వచ్చిన షణ్ను ఈ బ్రేకప్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌