amp pages | Sakshi

ఢీ– 13 విన్నర్‌గా లారీ డ్రైవర్‌ కూతురు.. మనమ్మాయే!..

Published on Fri, 12/10/2021 - 14:40

సాక్షి, తాండూరు టౌన్‌(వికారాబాద్‌): తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఢీ– 13 డ్యాన్స్‌ పోటీల్లో టైటిల్‌ విన్నర్‌గా  నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్‌ పోటీల్లో కార్తీక్‌ను ఓడించి టైటిల్‌ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన లారీ డ్రైవర్‌ మహేశ్, పద్మావతి దంపతుల కూతురు దువచర్ల కావ్యశ్రీ, స్థానిక భాష్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతోంది. 

చిన్ననాటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ఆమెకు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఢీ– 13లోఅవకాశం దక్కింది. ప్రతీ రౌండ్‌లో సత్తా చాటుతూ పోటీదారులకు సవాలు విసిరింది. ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విజేతగా నిలిచింది. కావ్యశ్రీ విజయంపై భాష్యం కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేదే తన లక్ష్యమని కావ్యశ్రీ తెలిపింది.  
చదవండి: కపిల్‌ దేవ్‌ బయోపిక్‌కు షాక్‌, నిర్మాతలపై చీటింగ్‌ కేసు
చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్‌ రవి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

     


 

Videos

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని

రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)