amp pages | Sakshi

హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్‌ సల్మాన్‌

Published on Mon, 08/08/2022 - 14:12

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్‌ నేపథ్యంలో ఓ చానల్‌తో ముచ్చటించాడు దుల్కర్‌ సల్మాన్‌.

చదవండి: లోకేశ్‌ కనకరాజు-విజయ్‌ చిత్రం, ‘విక్రమ్‌’ను మించిన స్క్రిప్ట్‌! అదిరిపోయిందిగా..

ఈ సందర్భంగా తన తండ్రి మమ్ముట్టి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను సినిమాల్లోకి వస్తానని చెబితే నాన్న బాధపడ్డారంటూ షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. ఈ సందర్భంగా దుల్కర్‌ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు, డాన్స్‌లు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని దుబాయ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఆ విషయంలో టాలీవుడ్‌ గ్రేట్‌: తమిళ నిర్మాత రాజన్‌

ఆ తర్వాత ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే జరిగిందన్నాడు. ‘నేను సినిమాల్లోకి వెళతానని చెప్పాగానే నాన్న పెద్ద గొడవ చేశారు. అంతకుముందు ఆయనను ఎప్పుడూ అంత కోపం, బాధతో చూడలేదు. హీరోగా చేస్తానని చెప్పగానే నువ్వు ఎప్పుడూ సరదాగా డాన్స్‌ చేసింది లేదు.. నటించేందుకు నువ్వు ప్రయత్నించడం కూడా నేనేప్పుడు చూడలేదు. యాక్టింగ్‌ అంటే నువ్వు అనుకున్నత సులువు కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు’ అని చివాట్లు పెట్టారని చెప్పాడు. తాను నటిస్తానంటే వద్దని చెప్పిన ఆయనే ఇప్పుడు తన సినిమాలు చూసి సూచనలు ఇస్తుంటారని దుల్కర్‌ పేర్కొన్నాడు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)