amp pages | Sakshi

రామ్‌ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్‌ ఫాజిల్‌!

Published on Wed, 08/18/2021 - 20:50

మెగా పవర్‌ స్టార్‌, సెన్సేషనల్‌ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ పాన్‌ ఇండియా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ  ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పై రానుంది. ఈ మూవీ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఖారరైన సంగతి తెలిసిందే. అయితే పాపులర్‌ క్యాస్ట్‌ అండ్‌ క్రూతో ఈ మూవీ రూపొందిస్తున్నాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది స్టార్‌ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

తాజాగా ఈ మూవీలో విలన్‌ కోసం మలయాళ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను శంకర్‌ టీం  సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్‌ సినిమాలో హీరోకు బలమైన పోటీగా ప్రతినాయకుడు పాత్ర ఉంటుంది. ఈ మూవీలో కూడా బలమైన క్యారెక్టరైషన్‌తో విలన్‌ పాత్ర ఉండబోతుందట. అందుకోసమే చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతి నాయకుడిగా ఫహద్‌ అయితే బాగుంటుందని శంకర్‌ భావించారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతు​న్నట్లు వినికిడి. అయితే ఫహద్‌ ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ మూవీతో పాటు మలయాళం, తమిళంలో పలు భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో శంకర్‌ మూవీ ఆఫర్‌ రావడంతో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అతడు ధైర్యం చేయడం లేదట. అందుకే కాస్తా టైం అడిగి తన డేటు సర్దుబాటు చేసుకుని చెప్తానని చెప్పినట్లు సమాచారం. అదంతా ఒకే అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువనుందట. కాగా ఇటీవల ఫహాద్‌ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ పుష్పలోని ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇందులో ‘చెడు చూడటానికి ఎప్పుడూ ప్రమాదకరంగా కనిపించదు. హ్యాపీబర్త్‌డే ఫహద్‌ ఫాజిల్‌’ అని కేవలం ఫహద్‌ కన్ను చిత్రాన్ని మాత్రమే పోస్టర్‌పై ఉంచారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌