amp pages | Sakshi

అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Published on Thu, 10/13/2022 - 11:08

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్‌ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు.

గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్‌ చేశాడు. అందులో ఒక ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని  ఆర్టీజీవి ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

(చదవండి: రిలీజ్‌కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారా? డైరెక్టర్‌ ట్వీట్‌ వైరల్‌)

ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్‌. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు.  ఒక రోజు పేపర్‌ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్‌లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను..  ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

Videos

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?