amp pages | Sakshi

వైరల్‌ అవుతోన్న జెనిలియా ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Sat, 11/27/2021 - 11:16

‘బొమ్మరిల్లు’ సినిమాతో హా హా.. హాసిని అంటూ అందరి మనసులో అలా నిలిచిపోయింది నటి జెనిలియా. ఆ తర్వాత ‘రెడీ’, ‘ఢీ’.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పి హౌజ్‌ వైఫ్‌గా మారింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఉంటుంది. 

చదవండి: ‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్‌’

ఈ నేపథ్యంలో ఇటీవల తన పెద్ద కుమారుడు రియాన్‌ 7వ పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. రియాన్‌పై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్‌ నెటిజన్ల హృదయాలను హద్దుకుంటోంది. దీంతో ఆ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రియాన్‌ కోసం ఓ లేఖ రాసుకొచ్చింది జెన్నీ. ‘ప్రియమైన రియాన్‌! నీ చిట్టి బుర్రలో ఉన్న బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా.

చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్‌ ఎంట్రీ..

ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌. ఐ లవ్‌ యూ మై బ్రేవ్‌ బాయ్‌’ అంటూ తల్లి ప్రేమను కురిపించింది. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటే తమ అభిమాని హీరోయిన్‌ జెన్నీ ఇలా ఏమోషనల్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జెనిలియా, రితేశ్‌లు తమ కుమారులు ఎప్పుడు సమయంలో కేటాయిస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన వారిని వెంట తీసుకుని వారితో సరదాగా గడుపుతుంటారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)