amp pages | Sakshi

'జిన్నా' మూవీ రివ్యూ

Published on Fri, 10/21/2022 - 13:04

టైటిల్‌: జిన్నా
నటీనటులు: మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌, వెన్నెల కిశోర్‌, సునీల్‌, నరేశ్‌, రఘుబాబు, సత్యం రాజేశ్‌, చమ్మక్‌ చంద్ర,సద్దాం తదితరులు 
నిర్మాణ సంస్థలు:  అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ 
నిర్మాతలు: మోహన్‌బాబు, మంచు విష్ణు
కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌
దర్శకత్వం: ఇషాన్‌ సూర్య
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
ఎడిటర్‌: చోటా కే ప్రసాద్
విడుదల తేది: అక్టోబర్‌ 21, 2022

మంచు విష్ణు హీరోగా ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా 'జిన్నా'. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్స్‌గా నటించారు. స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్‌ 21) విడుదలైంది. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

జిన్నా  కథ ఏంటంటే..
గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్‌హౌస్‌ నడుపుతుంటాడు. అప్పుచేసి మరీ టెంట్‌హౌస్‌ పెడతాడు. అయితే అతను టెంట్‌హస్‌ వేస్తే పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకూ అప్పు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే.. తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండీషన్‌ పెడతాడు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్‌)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే  మిగితా కథ.

ఎవరెలా నటించారంటే.. 
జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తుచేస్తాయి.యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్‌ రాజ్‌పుత్‌  చేసిన స్వాతి పాత్ర రొటీన్‌గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. సన్నీలియోన్‌ పాత్ర అందరిని మెస్మరైజ్‌ చేస్తుంది. కానీ ఇంటర్వెల్‌ ట్విస్ట్ రివీల్ చేశాక, ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్‌, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.బిగ్‌బాస్‌ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్‌ అప్పీరియన్స్‌లో కనిపించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఆకట్టుకుంటుంది.

ఎలా ఉందంటే..జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్‌నెస్‌ ఏమీ లేదు కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగుతున్న కథకు ఇంటర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఎదురవుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్  తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది.

సెకండాఫ్‌ను కొంచెం డిఫరెంట్‌గా డీల్ చేసే ప్రయత్నం చేశారు.వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్‌ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు.ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)