amp pages | Sakshi

బిజినెస్‌ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?

Published on Tue, 11/22/2022 - 11:00

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నవంబర్‌ 20న ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక బిజినెస్ విమెన్ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఆమె ఇంటీరియర్ డిజైన్‌ కంపెనీ రన్‌ చేస్తోంది.

బిజినెస్‌ విమెన్‌గా అనూష అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే నాగశౌర్య చేసుకున్న అనూష ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, ఫైనాన్షియల్‌ స్టేటస్‌ ఏంటని అంత ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధంలేని అమ్మాయిని చేసుకున్న నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య తీసుకున్న కట్నం, అనూష శెట్టి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తాజా బజ్‌ ప్రకారం.. నాగశౌర్యకు భారీగా కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనూష తండ్రి బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయనకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. బిజినెస్‌లో ఆయన బాగానే సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు అనూష కూడా తన తండ్రికి సంబంధించిన వ్యాపారాల్లో చురుగ్గా ఉంటుందట. మరోవైపు సొంతంగా పెట్టుకున్న ఇంటిరియర్‌ బిజినెస్‌ కూడా కోట్లలో టర్నోవర్‌ ఉంటుందని వినికిడి. అయితే వివాహం సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

అనూష పేరు మీద దాదాపు రూ. 50 నుంచి 80 కోట్ల ప్రాపర్టీస్‌ ఉన్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై నాగశౌర్య, అతని కుటుంబ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నాగశౌర్య, అతని కుటుంబ సభ్యుల స్పందించేవరకు వేచి చూడాల్సిందే. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అతని చేతిలో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: 
షారుక్‌ ఇంటికి డైమండ్‌ నేమ్‌ ప్లేట్‌, మెరిసిపోతున్న మన్నత్‌
జబర్దస్త్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌