amp pages | Sakshi

మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం: సుశాంత్‌

Published on Thu, 08/03/2023 - 19:06

‘మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించాలని ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఆయనతో  సినిమా చేసే చాన్స్  వస్తుంది. ఆ అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అని యంగ్‌ హీరో సుశాంత్‌ అన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సుశాంత్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్ నాకు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్  ఫోన్ చేసి ఈ  భోళా శంకర్‌ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను.

► ఈ చిత్రంలో నాది క్యామియో రోల్‌. చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నా తో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేశ్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. చిరంజీవి గారిలోని ప్రత్యేక ఏమిటింటే .. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. 

► చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ అనగానే కాస్త భయమేసింది. నా బాడీ యీజ్ కోసం శేఖర్ మాస్టర్ టీంతో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాను. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరంజీవి గారు మాత్రం కూర్చొని మైండ్ లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు. తమన్నా కీర్తి కూడా మంచి డ్యాన్సర్స్. నలుగురం ఫ్రేమ్ లో వున్నప్పుడు నా మూలంగా స్టెప్ మార్చకూడదు కదా. అందుకే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ ఫుల్ గా వుంది. సినిమాలో ఈ పాట ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

కీర్తి అద్భుతమైన నటి. మహానటి సావిత్రి బయోపిక్ తో అందరి మనసులో చెరగని ముద్ర వేశారు. భోళా శంకర్ లో మా కెమిస్ట్రీ  నేచురల్ గా వచ్చింది. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అది మీకు తెరపై కనిపిస్తుంది.

మెహర్ రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ తో ప్రయాణించారు. ఆయనపడిన కష్టం చూశా. చిరంజీవి గారిని ఎలా ప్రజంట్ చేయాలి, అభిమానులని ఎలా అలరించాలి, కొత్తగా ఎలా చూపించాలనే ఆలోచనతో  వుండేవారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కోసం ఈ సినిమా  తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.  

సోలో హీరోగా రెండు కథల మీద వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం.

Videos

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం

ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)