amp pages | Sakshi

‘ఇందువదన’ మూవీ రివ్యూ

Published on Sat, 01/01/2022 - 17:08

టైటిల్‌ : ఇందువదన
నటీనటులు : వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు
నిర్మాతలు : మాధవి అదుర్తి
దర్శకత్వం : ఎం శ్రీనివాస రాజు (ఎమ్‌ఎస్‌ఆర్‌)
సంగీతం : శివ కాకాని
సినిమాటోగ్రఫీ : బీ మురళీకృష్ణ 
విడుదల తేది : జనవరి 1,2022

‘హ్యపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ సినిమాల తర్వాత వరుణ్‌ సందేశ్‌ నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని చూపించలేదు. ఇక సినిమాల చాన్స్‌ రాని సమయంలో ‘బిగ్‌బాస్‌’రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఆ షోతో వరుణ్‌ సందేశ్‌కి క్రేజ్‌ వచ్చినప్పటికీ.. పెద్దగా సినిమాలేవి చేయలేదు. చాలా రోజుల తర్వాత వరుణ్‌ ‘ఇందు వదన’అనే సినిమాలో మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చాడు. వరుణ్‌ సందేశ్‌ నటించిన తొలి పీరియాడికల్‌ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వరుణ్‌ సందేశ్‌ నటించిన ‘ఇందు వదన’మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
అగ్రహారం గ్రామానికి చెందిన వాసు(వరుణ్‌ సందేశ్‌) ఓ ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. అతను అడవిలో ఉండే గిరిజన యువతి ఇందు( ఫర్నాజ్‌ శెట్టి)తో తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. అయితే కులం కారణంగా వారి పెళ్లిని వాసు కుటుంబ సభ్యులు నిరాకరిస్తారు. అనుహ్యా కారణాల వల్ల ఇందు హత్యకు గురవుతుంది. అసలు ఇందుని హత్య చేసిందెవరు? ప్రేమించి, పెళ్లాడిన ఇందు చనిపోయిందని తెలుసుకున్న తర్వాత వాసు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తనను హత్య చేసిన వారిపై ఇందు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే.. 
టాలీవుడ్‌లో వరుణ్‌ సందేశ్‌కి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉంది. గతంలో ఆయన నుంచి అన్ని ప్రేమ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఇందు వదన మూవీలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వాసు పాత్రలో తెరపై సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్టింగ్‌ పరంగా కూడా ఇరగదీశాడు. ఫైట్‌ సీన్స్‌లో కూడా పర్వాలేదనిపించాడు. గిరిజన యువతి ఇందు పాత్రలో ఫర్నాజ్‌ శెట్టి ఒదిగిపోయింది. తొలి సినిమాయే అయినా.. అద్భుతంగా నటించింది. ఒకవైపు వరుణ్‌ సందేశ్‌తో రొమాన్స్‌  చేస్తూనే.. మరోవైపు దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టించింది. వరుణ్‌, ఫర్నాజ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే వరుణ్‌ సందేశ్‌ స్నేహితులుగా మహేశ్‌ విట్ట, ధనరాజ్‌, పార్వతీశం తమదైన కామెడీతో నవ్వించారు. నాగినీడు, అలీ, సురేశ్‌ వాణిలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఎలా ఉందంటే... ?
టాలీవుడ్‌లో హారర్ కామెడీ చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో  ప్రేమకథా చిత్రమ్, తను వచ్చెనంట, యూటర్న్ చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇందువదన’. లవ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్‌ఎస్‌ఆర్‌. దర్శకుడుకు ఎంచుకున్న పాయింట్‌ పాతతే అయినప్పటికీ.. ట్రీట్‌మెంట్‌ మాత్రం కొత్తగా ఉంది. చక్కటి ప్రేమ కథకి హారర్‌ని జోడించి సినిమాని తెరకెక్కించాడు. అయితే  కథలో బలం లేకపోవడంతో సినిమా స్థాయి తగ్గింది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ‘ఇందు వదన’ఓ మంచి హారర్‌-థ్రిల్లర్‌ మూవీ అయ్యేది.  ఫస్టాఫ్‌లో వాసు ఇందుల లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇంటెర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో దెయ్యంతో వచ్చే కామెడీ సీన్స్‌, అలీ ఎంట్రీ సీన్‌ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్‌ కథని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఇక సాంకేతిక విషయానికొస్తే... శివ కాకాని సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా అందించాడు. మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్‌ ఇంకాస్త తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)