amp pages | Sakshi

సరదాగా చేసిన ర్యాంప్‌ వాక్‌..హీరోయిన్‌ని చేసింది

Published on Sun, 01/15/2023 - 13:12

ఒక్క సంఘటన చాలు జీవితాన్ని మార్చేయడానికి! అలా సరదాగా చేసిన ర్యాంప్‌ వాక్‌ మోడలింగ్‌లో ఆమెకు అద్భుతమైన కెరీర్‌ను ఇవ్వడమేగాక సినిమా నటినీ చేసింది. ఆమే దీప్తి సతి. తాజాగా ఆమె నటించిన ‘సిన్‌’ సిరీస్‌తో హిట్‌తో టాక్‌ ఆఫ్‌ ది స్క్రీన్‌ అయింది. 

చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండే దీప్తి.. మూడేళ్ల వయసులోనే కథక్, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రదర్శనలూ ఇచ్చింది. 

కాలేజీ రోజుల్లో  ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ‘ఫ్రెష్‌ ఫేస్‌ హంట్‌’ దీప్తిని మోడల్‌గా మార్చింది. అప్పుడు సరదగా ర్యాంప్‌ వాక్‌ చేసిన దీప్తి.. తర్వాత 2012లో ‘మిస్‌ కేరళ’గా అందాల కిరీటాన్ని సాధించింది. ఇంకెన్నో పోటీల్లో పాల్గొని ప్రపంచానికి తన  ప్రతిభను చాటింది. 

మోడల్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ‘నీనా’ అనే మలయాళ చిత్రంతో నటిని చేసింది. తర్వాత తెలుగులో ‘జాగ్వార్‌’, తమిళంలో ‘సోలో’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

తండ్రి మరాఠీ, తల్లి మలయాళీ. కుటుంబం మొత్తం ముంబైలో స్థిరపడటంతో దీప్తికి మరాఠీ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లిష్‌ కూడా వచ్చు. కన్నడ, తమిళ భాషలూ నేర్చుకుని పలు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. 

ఈ మధ్యనే ‘సిన్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది. యూట్యూబ్‌లో దీప్తి చేసిన ‘లాక్‌డౌన్‌ టాక్స్‌’, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోని ‘ఓన్లీ ఫర్‌ సింగిల్స్‌’  సిరీస్‌లకూ మంచి ఆదరణే లభించింది.

ప్రతి అమ్మాయికి సొంతం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే వారు విజయం సాధించగలరు – దీప్తి సతి

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)