amp pages | Sakshi

తులసి- నందుల విడాకుల కథ క్లైమాక్స్‌కు!

Published on Wed, 07/07/2021 - 13:14

Intinti Gruhalakshmi July 7th Episode: తులసి, నందు విడిపోవాల్సిందేనా అని కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే అనసూయ మాత్రం దెప్పి పొడిచింది. ఎప్పుడెప్పుడు విడాకులు మంజూరవుతాయా? అని తహతహలాడిపోయింది. తులసి పీడ విరగడవుతుందని లోలోపలే ఆనందించింది. ఎప్పటిలాగే తులసి మీద విరుచుకుపడుతూ ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టింది.

మనసుకు శూలాల్లా గుచ్చుతున్నా పైకి అవేవీ కనిపించకుండా జాగ్రత్తపడింది తులసి. ఆమెను నానామాటలు అన్న అనసూయ మీదకు విరుచుకుపడింది ఆమె కూతురు మాధవి. నీలాంటి ఆడదాన్ని ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. సాటి ఆడది అనే జాలి లేకుండా వదిన జీవితం నాశనమైపోవాలని కోరుకుంటున్న నీకు పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉందని చీదరించుకుంది.

తులసికి విడాకులిస్తే నందు తన సొంతమైపోయినట్లేనని లాస్య తెగ ఆనందపడింది. మరికొద్ది క్షణాల్లో అతడు పూర్తిగా తనవాడు కాబోతున్నాడని సంబరపడిపోయింది. అయితే అప్పటిలోపు నందు మనసు మార్చుకోకుండా చూడమని భాగ్య హెచ్చరించడంతో లాస్య కన్నీటి డ్రామా మొదలు పెట్టింది. విడాకుల విషయంలో ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పడంతో అలాంటిదేమీ లేదని నందు బదులిచ్చాడు. అంతేకాకుండా లాస్యకు ప్రామిస్‌ కూడా చేశాడు. 

కోర్టుకు తులసి తల్లి కూడా వచ్చింది. ఎప్పటికైనా మీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అనుకున్న ప్రతీది జరగాలనుకోవడం అత్యాశేనని చెప్పుకొచ్చింది. రేపటి ఎపిసోడ్‌లో కోర్టు మెట్లెక్కిన నందు, తులసి ఇద్దరూ విడిపోవడానికి తప్పు నీదంటే నీదని నిందించుకున్నట్లు తెలుస్తోంది.. జడ్జి ముందే వాదులాటకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విడాకులు ఖాయంగా కనిపిస్తోంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)