amp pages | Sakshi

అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్‌ చంద్రల ట్రాక్‌ హైలెట్‌!

Published on Sun, 03/13/2022 - 12:02

‘పేపర్ బాయ్’ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై  ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్‌ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని  ఏప్రిల్‌లోపు కంప్లీట్‌ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్‌ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్‌ వర్కింగ్‌ స్టెల్‌ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. 

ఇక దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్‌’అని టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)