amp pages | Sakshi

నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ‍్చు.. నటి ఘాటు వ్యాఖ్యలు

Published on Mon, 11/29/2021 - 10:35

Jennifer Lawrence Opens Up About Her Private Photos Leak: 2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని  ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నిఫల్‌ లారెన్స్‌ ఆవేదన వ్యక్తం చేసింది. వేర్వేరు సెలబ్రిటీలకు సంబంధించిన సుమారు 500 ప్రైవేట్‌ ఫొటోలను హ్యాకర్లు సేకరించి ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. ఆ సెలబ్రిటీల్లో సింగర్‌ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు నటి జెన్నిఫర్‌ లారెన్స్‌ కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆ స్కాండల్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నానని వెల్లడించింది.

'నా అంగీకారం లేకుండా ఎవరైనా నా నగ్న శరీరాన్ని చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన వారేవరో వాటిని పోస్ట్ చేశారు. కానీ నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు.' అని తన మనసులోని బాధను ఘాటుగా బయటపెట్టింది జెన్నిఫర్‌. అలాగే గతంలో ఈ హ్యాక్‌ని ఒక లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పేర్కొంది. జెన్నిఫర్ 2017లో జరిగిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన స్వస్థలమైన లూయిస్ విల్లే, కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్‌ విమానంలో బయలుదేరింది. అ‍ప్పుడు విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్‌ కావడంతో చనిపోతాననే భావన గట్టిగా కలిగింది జెన్నిఫర్‌కు. 'నా అస్థిపంజరం సీటులో ఉండిపోతుంది. నేను నా కుటుంబానికి వాయిస్‌ మేయిల్స్‌ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను. నన్ను క్షమించండి.' అని అప్పటి అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. 

ప్రస్తుతం జెన్నిఫర్‌ తన రాబోయే చిత్రం డోంట్‌ లుక్ అప్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సెటైరికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ బ్లాక్‌ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్‌ లారెన్స్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 10న పరిమిత థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్‌ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఇది చదవండి: ఇండియన్‌ ఫుడ్‌ అంటే ఇష్టమంటున్న 'వండర్‌ వుమెన్‌'

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)