నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
క్రేజీ అప్డేట్: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి
Published on Sat, 10/02/2021 - 17:50
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్ర ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికి ఎన్నోసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులంతా ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుస్తూన్న తరుణంలో తాజాగా డైరెక్టర్ రాజమౌళి ఈ సస్పెన్స్‌కు తెర దింపాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాల కొత్త లుక్‌ను పరిచయం చేస్తూ.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన మూవీ విడుదల చేయబోతున్న ట్విటర్లో వెల్లడించారు.
Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥
— RRR Movie (@RRRMovie) October 2, 2021
An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7
Tags