amp pages | Sakshi

మరో పవర్‌ఫుల్ పాత్ర‌‌: ఇందిరాగాంధీగా కంగనా

Published on Fri, 01/29/2021 - 14:43

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్‌. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్‌ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబం‍ధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్‌ చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్‌ స్టైల్‌, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది.

ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్‌ కూడా పూర్తయ్యింది.

ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, మొరార్జీ దేశాయ్‌, లాల్‌బహదూర్‌ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్‌ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌