amp pages | Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేస్తోన్న కాంతార, అంతలోనే ట్విస్ట్‌!

Published on Thu, 11/17/2022 - 17:53

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా రిలీజై భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రూ.360 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆత్రుతకు ఆనందం జోడించే ప్రకటన వెలువడింది. అధికారికంగా కాంతార ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 24 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్వీట్‌ వేసింది. ఈ వార్త విని సినీప్రియులు పండగ చేసుకున్నారు. మొత్తానికి కాంతారను మరోసారి చూసే ఛాన్స్‌ రాబోతోందని ఫుల్‌ ఖుషీ అయ్యారు. కానీ అంతలోనే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసింది ప్రైమ్‌ వీడియో. స్ట్రీమింగ్‌ డేట్‌ మార్చడానికి ట్వీట్‌ డిలీట్‌ చేశారా? లేదంటే అఫీషియల్‌గా మరోసారి అనౌన్స్‌ చేస్తారా? చూడాలి!

కాగా కాంతార సెప్టెంబర్‌ 30న రిలీజై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ దీన్ని తెలుగులో అక్టోబర్‌ 15న రిలీజ్‌ చేయగా ఇక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక హిందీలో అయితే ఇప్పటికీ వసూళ్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించాడు. అజనీష్‌ లోకనాధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు.

చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్‌ హీరో ఎవరంటే?
కూతురి సినీఎంట్రీపై స్పందించిన రోజా

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)