amp pages | Sakshi

karthika Deepam: ఈ దేవుడే కాదు.. ఆ దేవుడు కూడా దగా చేశాడు: దీప

Published on Mon, 05/17/2021 - 14:44

కార్తీకదీపం మే 17: నువ్వు ఇలానే బాధపడుతుంటే పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు పిల్లలు తట్టుకుంటారా అని  కార్తీక్‌ దీపతో అంటాడు. గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను భయపడకంటూ కార్తీక్‌ దీపకు  ధై​ర్యం చెబుతుంటే..  కనీసం ఇప్పుడైన నన్ను ముట్టుకోవాలనిపించడం లేదా డాక్టర్‌ బాబు అని అంటుంది. ఇక కార్తీక్‌ అదేంలేదు ఏదో ఆలోచిస్తున్నానంటూ దీప భుజం తట్టగా.. కార్తీక్‌ చేతిని దీప తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత..

‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగానే ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుది వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు’ అంటు దీప భావోద్యేగానికి లోనవుతుంది. ఆ తర్వాత లేచి బెడ్‌రూంకి వెళ్లిపోతుంది. మరోవైపు దీపకు ఏదో జరిగినట్లు మురళీ కృష్ణకు పీడకల రావడంతో  ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు. అలాగే షాక్‌లో ఉండిపోయిన మురళీ కృష్ణకు భాగ్యం నీళ్లు తాగించి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఏమైందయ్యా అని  ఆమె అడగ్గా.. ఇలా దీప గురించి కల వచ్చిందిని చెప్తాడు. ‘నా వల్ల కాదు. నా కూతురి కోసం బాధపడుతూ ఇక్కడే ఉండలేను’ అంటాడు.

వెంటనే దీపను వెతకడానికి బయలుదేరుతానంటూ మురళీ కృష్ణ కదులుతుండగా.. భాగ్యం.. ‘ఆగండి కోడలును వెతకడానికి కోట్లు ఖర్చపెట్టైనా వాళ్ల అత్తగారు వెతుకుతారు. కానీ, నీకేమైనా అయితే నేను ఒంటరి దాన్నిఅవుతాను‘అంటూ మురళీ కృష్ణను ఆపుతుంది. ఆ తర్వాత దీప ఫోన్‌ చేస్తానంటూ భాగ్యం ఫొన్‌ తీసుకుని దీప నంబర్‌కు కాల్‌ చేస్తుంది. ఫోన్‌ రింగ్‌ అవ్వడంతో కార్తీక్‌, దీపలకు మెలకువ వస్తుంది. అర్థరాత్రి తండ్రి నుంచి కాల్‌ రావడంతో నాన్నకు ఏమయినా అయిందేమో మా పిన్ని చేస్తున్నట్టుంది ఫోన్‌ ఎత్తండి డాక్టర్‌ బాబు అంటుంది దీప. కార్తీక్‌ ఫొన్‌ లిఫ్ట్‌ చేసి హాలో అనడంతో.. భాగ్యం ఎవరో మగ గొంతు వినిపిస్తుందయ్యా అంటుంది. ఆ తర్వాత మురళీ కృష్ణ ఫోన్‌ తీసుకుని మాట్లాడగా.. హాలో నేను కార్తీక్‌ అని చెప్పడంతో అతడికి ఒక్కసారిగా ప్రాణం లేచస్తుంది.

ఇక దీప దగ్గరే ఉన్నారా అనగా అవునంటాడు. దీప ఎక్కడుందో చెప్పి.. మీ నాన్నతో మాట్లాడమని దీపకు ఫోన్‌ ఇస్తాడు కార్తీక్‌. దీప ఫోన్‌ తీసుకుని ‘ధగా పడ్డావని ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయావమ్మా అని మురళీ కృష్ణ అనడంతో. ‘అవును నాన్నా ఈ దేవుడే కాదు.. నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడని’ మనసులో అనుకుంటుంది. అంత కష్టపడటం దేనికమ్మా.. మనంటికి రామ్మా.. నీకోసం నీ పుట్టింటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటాడు  మురళీ కృష్ణ. అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది దీప. వెంటనే మురళీ కృష్ణ.. ‘సరే ఈ రాత్రికి ఆ మాటలెందుకులే ప్రశాంతంగా పడుకోమ్మా అనగానే దీప.. ఇక నుంచి నాకు అంతా ప్రశాంతతే నాన్న’ అని మనసులోనే అనుకుంటుంది దీప. చాలా సంతోషం తల్లీ నువ్వు ప్రశాంతంగా ఉండటమే కావాలి అంటు ఫొన్‌ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)