amp pages | Sakshi

20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా?

Published on Thu, 03/10/2022 - 19:02

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌ 'షెహజాదా'లో నటిస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ మీరోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా కార్తీక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్‌ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో అర్జున్‌ పాతక్‌ అనే అమ్మాయి ధమాకా సినిమాలోని డైలాగులను వల్లెవేసింది. డైలాగ్‌ చెప్పడం పూర్తవగానే ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్‌ అంటూ కామెంట్లు చేశారు. కానీ ఒక నెటిజన్‌ మాత్రం 'రూ.20 కోట్లిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని హీరోను అడిగింది. దీనికి కార్తీక్‌ ఆర్యన్‌ బదులిస్తూ 'సరే, ఎప్పుడు చేసుకుందాం?' అని అడగ్గా 'వచ్చేసేయ్‌, ఇప్పుడే చేసుకుందాం' అని రిప్లై ఇచ్చింది.

ఇది చూసిన కొందరు అమ్మాయిలు నేనూ ఇస్తా 20 కోట్ల రూపాయలు, నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లతో హీరో వెంటపడ్డారు. దీంతో కార్తీక్‌ ఆర్యన్‌ 'వేలంపాట వేద్దామా?' అని సరదాగా చమత్కరించాడు. కాగా కార్తీక్‌ ఆర్యన్‌ చివరిసారిగా 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గతేడాది రిలీజైంది. ప్రస్తుతం అతడు నటించిన 'షెహజాదా' నవంబర్‌ 4న రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే 'భూల్‌ భులాయా 2', 'ఫ్రెడ్డీ' సినిమాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)