amp pages | Sakshi

నమ్మట్లేదా ? ఆధార్‌ కార్డు చూపించనా ?: యంగ్‌ హీరో

Published on Fri, 07/08/2022 - 16:13

Kartik Aaryan Says Aadhar Card Dikha Doon: బాలీవుడ్​ చాక్లెట్​ బాయ్​ కార్తీక్ ఆర్యన్​ ఇటీవల నటించి సూపర్​ హిట్​ కొట్టిన చిత్రం 'భూల్​ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్​ మూవీ బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత సక్సెస్​ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఎంజాయ్​ చేస్తున్నాడు కార్తీక్​ ఆర్యన్​. ఇందులో భాగంగానే కార్తీక్‌ తాజాగా యూరప్‌ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న కార్తీక్‌కు వింత సంఘటన ఎదురైంది. 

యూరప్‌ వీధుల్లో స్ట్రీట్‌ఫుడ్‌ తింటూ ఆస్వాదిస్తున్న కార్తీక్‌ ఆర్యన్‌ను చూసి ఓ అభిమాని సందేహం వ్యక్తం చేశాడు. కార్తీక్‌ దగ్గరకు వెళ్లి 'మీరు హీరో కార్తీక్‌ ఆర్యన్ కదా ? మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా ? ఎందుకంటే మీరు కార్తీక్‌ ఆర్యన్ అంటే మా ఫ్రెండ్స్‌ నమ్మట్లేదు' అందుకే అడుగుతున్నా అని చెప్పాడు. 'దీనికి అవును, నేను కార్తీక్‌ ఆర్యన్‌. నమ్మడం లేదా?  నా ఆధార్‌ కార్డ్‌ చూపించనా ?' అంటూ చమత్కరించాడు. కార్తీక్‌ మాటలకు ఆనందంతో తన ఫ్రెండ్స్‌ని పిలిచి అతనితో ఫొటోలు దిగాడు ఆ ఫ్యాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'కార్తీక్‌ మీరు చాలా సింపుల్‌, సరదాగా ఉన్నారు', 'కార్తీక్‌ మీ టైమింగ్‌ అదిరింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)