amp pages | Sakshi

పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్.. వరుడు అతనేనా?

Published on Sun, 11/27/2022 - 20:06

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తరచూ డిన్నర్‌ పార్టీలని, హాలీడే ట్రిప్‌లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తుంటారు. మరి ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కానుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే కాఫీ విత్‌ కరణ్‌ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. 

ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెళ్లి వార్తలకు ఆ వీడియో మరింత బలం చేకూరుస్తోంది. కియారా తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.  అందులో చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. కియారా అద్వానీ  వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులను ఆటపట్టించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి ప్రకటన చేస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.

ఇన్‌స్టాలో కియారా వీడియో షేర్‌ చేస్తూ.. ' ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. త్వరలోనే ప్రకటిస్తున్నా. డిసెంబర్ 2న ప్రకటిస్తా. వేచి ఉండండి' అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ అభిమాని సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారా? అని కామెంట్ చేయగా.. మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమేనా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం విక్కీ కౌశల్,  భూమి పెడ్నేకర్‌లతో కలిసి నటించిన గోవిందా నామ్ మేరా విడుదలకు సిద్ధమవుతోంది.  గోవింద నామ్ మేరా డిసెంబర్ 16న ఓటీటీలో విడుదల కానుంది. ఆమె తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో సత్యప్రేమ్ కి కథ, రామ్ చరణ్‌తో ఆర్‌సీ15 కనిపించనుంది.

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌