amp pages | Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌పై మహేశ్‌ ​‍స్పందన

Published on Mon, 11/01/2021 - 21:08

Mahesh Babu Comments On RRR Movie Teaser: దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌( ‘రౌద్రం.. రణం.. రుధిరం’). రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌.

చదవండి: కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్‌: సామ్‌ ఆసక్తికర వీడియో

ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45 సెకన్ల పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్‌ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం బాగా ఆకట్టుకుంటోంది. రోమాలు నిక్కబొడిచేలా రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ స‌హా మిగిలిన న‌టీన‌టుల భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ఫస్ట్‌ గ్లీంప్స్‌ను బయటకు వదిలారు. తాజాగా ఈ టీజర్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పందించారు.

చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి చిత్రం ‘జేమ్స్‌’ మేకర్స్‌ కీలక నిర్ణయం

‘వావ్..స్ట‌న్నింగ్‌. అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో టీజర్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. వావ్‌ అనకుండా ఉండలేం. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మరింత ఆసక్తి పెరిగింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.

Videos

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌