amp pages | Sakshi

మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్‌!

Published on Sat, 03/20/2021 - 17:37

ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్‌ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్‌ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్‌ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ కెరీర్‌లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకం‍గా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్‌ కాజల్‌ నటిస్తుంది. 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్‌ చేసేశారు.  

చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు. 

ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్‌ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ అనౌన్స్‌ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్‌ చేశారు. చదవండి :
బ్రేక్‌ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్‌

డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌