amp pages | Sakshi

సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ఎఫ్‌ 3 భామ!

Published on Tue, 02/16/2021 - 14:44

టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ నటిస్తన్న ఈ సినిమా షూటింగ్‌ హైదరబాద్‌లో జరుపుకుంటోంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మెహరీన్‌కు సంబంధించిన ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇకపై మెహరీన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని దీని సారాంశం. ఎఫ్‌ 3 తరువాత మరే ఏ సినిమాలోనూ నటించదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తను వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే కారణం అని తెలుస్తోంది. 

కాగా త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కనుందన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని, మెహరీన్ పెళ్లాడబోతున్నట్లు ఇటీవల ఆవిడే స్వయంగా వెల్లడించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడే భవ్య బిష్ణోయ్‌. రాజస్థాన్‌లోని జైపుర్‌ అలీలా కోటలో మార్చి 12న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. అయితే గొప్పింటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి మెహరీన్ ఇకపై నటించకపోవచ్చని అంటున్నారు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకున్న ఆమె సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అదే విధంగా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని వివరించారు.
చదవండి: మాజీ సీఎం మనువడితో హీరోయిన్‌ పెళ్లి..

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)