amp pages | Sakshi

Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్‌ వారెంట్‌

Published on Sat, 04/23/2022 - 08:15

నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌పై జీవిత రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు.

తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్‌ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు  హాజరు కాకపోవడంతో ఎన్‌ఐ యాక్ట్‌ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్‌పై  ఆమె రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

చదవండి: (ఏది నిజం?: విద్యుత్‌ వెలుగులపై చీకటి రాతలు) 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)