amp pages | Sakshi

జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్నా: నటి

Published on Fri, 01/20/2023 - 13:58

పెళ్లంటే నాకు చిరాకు, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని డైలాగులు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఆ మాట మీద నిలబడేవాళ్లను మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదంటారు కదా.. అలాంటి శుభ ఘడియలు వచ్చాయంటే ఎవరెన్ని అనుకున్నా చివరికి పెళ్లిపీటలెక్కాల్సిందే! ఏడడుగులు నడవాల్సిందే! తన విషయంలో కూడా అదే జరిగిందంటోంది నటి, దర్శకనిర్మాత నీతూ భజ్వా.

'పెళ్లి ప్రస్తావన ఎత్తితేనే ముఖం తిప్పుకునేదాన్ని. నేనంత రొమాంటిక్‌ కాదు, చాలా ప్రాక్టికల్‌ పర్సన్‌ను. అందుకే అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నా.. ఎప్పటికీ సింగిల్‌గా ఉండిపోవాలని ఫిక్సయ్యా. కానీ మనకు సరైన వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు గుండెలో గంటలు మోగడం, ప్రకృతి స్థంభించిపోవడం వంటివి జరుగుతాయంటారు కదా! హ్యారీని చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. మొదటి చూపులోనే అతడిని నేనే పెళ్లాడబోయేది తానేనని అర్థమైంది. నా సోదరికి అతడు తెలుసు కాబట్టి మా పెళ్లి చాలా ఈజీగా జరిగిపోయింది. పెళ్లయ్యాక నేను మరింత సక్సెస్‌ఫుల్‌ అయ్యాననిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది.

కాగా నీతూ 1998లో వచ్చిన మై సోలా బరాస్‌ కీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత అస్తిత్వ.. ఏక్‌ ప్రేమ్‌ కహానీ, జీత్‌, గన్స్‌ అండ్‌ రోజెస్‌ సీరియల్స్‌తో బుల్లితెరపై సందడి చేసింది. అనంతరం షాదీ లవ్‌ స్టోరీ, జట్‌ అండ్‌ జూలియట్‌ 2, నాటీ జట్టాస్‌ అనే పంజాబీ చిత్రాల్లో నటించింది.

చదవండి: అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా? నటుడిపై ట్రోలింగ్‌
నిర్మాత మహేశ్‌ భట్‌కు సర్జరీ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)