amp pages | Sakshi

లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ 'నేనెవరు' ఆడియో రిలీజ్

Published on Mon, 09/19/2022 - 17:05

ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'.  ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస‍్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

(చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం)

 ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. 
        

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌