amp pages | Sakshi

కలెక్టర్​గా నితిన్​ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ

Published on Fri, 08/12/2022 - 12:31

టైటిల్:​ మాచర్ల నియోజకవర్గం
నటీనటులు: నితిన్​, కృతీశెట్టి, కేథరిన్​ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్​ తదితరులు
నిర్మాతలు: సుధాకర్​ రెడ్డి, నిఖితా రెడ్డి 
దర్శకత్వం: ఎమ్​ఎస్​ రాజశేఖర్ రెడ్డి
సంగీతం: మహతి స్వరసాగర్​
సినిమాటోగ్రఫీ: ప్రసాద్​ మూరేళ్ల
విడుదల తేది: ఆగస్టు 12, 2022


నితిన్‌, కృతీశెట్టి, కేథరిన్​ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్​ కమర్షియల్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. 


కథ:
సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ:
ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు​ భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్​, కలెక్టర్​ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్​ఎస్​ రాజశేఖర్​ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ  రెగ్యూలర్​ రొటీన్​ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్​ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్​ను కొత్తగా చూపించారు. కలెక్టర్​గా నితిన్​ చెప్పే డైలాగ్​లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.   


ఎవరెలా చేశారంటే?
గుంటూరు కలెక్టర్​ సిద్ధార్థ రెడ్డిగా నితిన్​ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్​ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్​ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్​ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్​ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్​ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్​గా రొటీన్​ ఫార్ములాతో నితిన్​ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది.

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)