amp pages | Sakshi

దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్‌ రాలేదు: పరుచూరి

Published on Sat, 05/27/2023 - 14:30

ఇటీవలి కాలంలో వచ్చిన సమంత శాకుంతలం సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బొక్కబోర్లా పడింది. కనీస వసూళ్లు సాధించడంలోనూ విఫలమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు.

శాకుంతలం ఓ జ్ఞాపకం..
'శాకుంతలం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. గతంలో నేను తెలుగు ఉపన్యాసకుడిగా పని చేశాను. ఆ సమయంలో నేను శాకుంతలం నాటకం చూశాను. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత గుణశేఖర్‌ సినిమా తీయడంతో మళ్లీ చూశా. ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తే అందులో కొత్తదనం కనిపిస్తుంది. రానాగారితో హిరణ్యకశ్యప చేద్దామనుకున్నాడు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పుడు వేరే సోషల్‌ కథ ఎంచుకోకుండా శాకుంతలం సినిమా తీశాడు.

ఆ సీన్‌ ఒరిజినల్‌ కథలో లేదు!
ప్రేమ, గంధర్వ వివాహం.. ఆ ప్రేమను ఓ శాపం వల్ల మర్చిపోవడం, చివర్లో భార్యాభర్తలు కలవడం.. భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు ఎలా పుట్టాడనేదే కథ. శకుంతల గర్భం దాల్చిన తర్వాత మహారాజుని కలవడానికి వెళ్లడం, ఆయన వెళ్లిపోమని కేకలు వేయడం.. బయటకు వచ్చిన ఆమెను గ్రామస్తులు రాళ్లతో కొట్టడం చూపించారు. సానుభూతి కోసం ఈ సీన్‌ పెట్టారేమో కానీ నాకు తెలిసినంత వరకు అభిజ్ఞాన శాకుంతలంలో ఆమెను రాళ్లతో కొట్టలేదు.

చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోతుంది
శకుంతల- దుష్యంతుల ప్రేమ.. వారికి భరతుడు పుట్టాడనే కథ ఎన్ని సంవత్సరాలైనా సజీవంగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతుడు కలుస్తారా? లేదా? ఆసక్తి క్రియేట్‌ చేశారు. సెకండాఫ్‌లో ఉంగరం చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోవడం ఖాయమని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. గుణశేఖర్‌ రచన, దర్శకత్వంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఈ ఒక్క సీన్‌తో ఆసక్తి తగ్గిపోవచ్చు. సినిమా కలెక్షన్లపై సెకండాఫ్‌ ప్రభావం చూపించిందేమోనని నేను భావిస్తున్నాను.

సమంత చిన్నమ్మాయే అయినా..
చివర్లో దుష్యంతుడు స్వయంగా వచ్చినా కూడా శకుంతల ఆయన దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు.. ఇక్కడ మంచి డ్రామా క్రియేట్‌ చేశారు. సమంత చిన్నమ్మాయే అయినా అద్భుతంగా నటించింది. దుష్యంతుడి పాత్రకు దేవ్‌ మోహన్‌ న్యాయం చేశాడు. ప్రజలు మర్చిపోతున్న మహాభారతంలోని ఓ ముఖ్య నాటకాన్ని సొంత డబ్బుతో తెరకెక్కించిన గుణశేఖర్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌' అని చెప్పాడు గోపాలకృష్ణ.

చదవండి: ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య, అందుకే విడాకులు!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)