amp pages | Sakshi

పవన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి కానుకగా

Published on Sat, 01/15/2022 - 18:11

Pawan Kalyan Bheemla Nayak New Poster On The Sankranti Eve: టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ల వస్తున్న మల్టిస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. అయితే జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన భీమ్లా నాయక్‌ ఫిబ్రవరి 25కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులను నిరాశ పరచకుండా ఉండేందుకు పోస్టర్స్‌, సాంగ్స్‌ వంటివి విడుదల చేస్తున్నారు. ఇదీవరకు న్యూ ఇయర్‌ సందర్భంగా భీమ్లా నాయక్‌ సాంగ్‌ డీజే వెర్షన్‌ను రిలీజ్‌ చేసి ఆకట్టుకున్నారు. 

తాజాగా సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్‌ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ ఆడియెన్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి మాస్‌ లుక్ ఆకట్టుకుంటోంది. నోట్లో సిగరెట్‌ పెట్టకుని రానా దర్జాగా నిలబడితే.. ఉగ్ర రూపంలో పౌరుషంగా పవన్‌ కల్యాణ్‌ నిలుచుని ఉన్నారు. ప్రస్తుతం  ఈ  పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సంక్రాంతికి సినిమా విడుదల కాకపోయినా ఈ పోస్టర్‌ రిలీజ్‌ చేశారని ఫ‍్యాన్స్‌ ఆనందపడుతున్నారు. ఇక భీమ్లా నాయక్‌ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్యా మీనన్‌, రానాకు జంటగా సంయుక్తా మీనన్‌ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
 

ఇదీ చదవండి: లాలా భీమ్లా డీజే వెర్షన్‌ వచ్చేసింది, మామూలుగా లేదుగా..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)