amp pages | Sakshi

సమంత స్పెషల్‌ సాంగ్‌పై పేరడీ, అమ్మాయిలకు కౌంటర్‌గా లిరిక్స్‌..

Published on Fri, 12/17/2021 - 19:54

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌ను వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా అంటూ సాగే ఈ పాటపై పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మీ మగబుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్స్‌ మగవారిని చెడ్డవారిగా చూపించినట్టు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. దీనిఇన తొలగించాలని లేదంటూ కేసు పెడుతామని ఏపీ పురుషుల సంఘం హెచ్చిరించింది.

చదవండి: వివాదంలో పుష్ప స్పెషల్‌ సాంగ్‌, స్పందించిన దేవిశ్రీ

ఇదిలా ఉంటే ఈ పాటు యూట్యూబ్‌లో దూసుకుపోతూ ట్రెండ్‌ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప స్పెషల్‌ సాంగ్‌ మానియానే కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ పాటకు కౌంటర్‌గా పేరడీలు కూడా వచ్చేశాయి. మగాళ్లంతా ఇంతే అన్న రితీలో ఉన్న లిరిక్స్‌కు అడవాళ్లకు కౌంటర్‌ ఇస్తూ ఉన్న ఈ పేరడీ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చలన్‌ చేస్తోంది. మరి ఈ పాట ఎలా ఉందో చూద్దాం.

చదవండి: సమంత స్పెషల్‌ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత

‘కోక కట్టినా.. గౌను వేసినా వంకరగా చూస్తారానే లిరిక్స్‌కు దీటుగా.. పొట్టి బట్టలు వేసి టెంప్ట్ చేస్తారంటూ పేరడీ సాంగ్‌లో రాసుకొచ్చారు. రంగుతో పని లేకుండా అందరినీ వంకరగా చూస్తారన్నదానికి.. అబ్బాయి అందాన్ని కాకుండా డబ్బును చూసి ఊ.. అంటారనేది కౌంటర్ లిరిక్. బొద్దు, సన్నం కాదు.. ఒంటిగ ఉంటే.. నలిపేస్తారని అక్కడ అంటే.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్ద మనిషిలాగే ఉంటారు.. చీకటి పడితే.. తప్పుడు ఆలోచనలే అని అక్కడ అంటే.. సమయం వచ్చినప్పుడు అందరూ వంకరగా చూస్తారు’ అంటూ ఈ పేరడీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పేరడీ సాంగ్‌ చర్చనీయాంశమైంది. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)