amp pages | Sakshi

విద్యార్థిని క‌ల‌ను నిజం చేసిన‌ ప్ర‌కాశ్ రాజ్‌

Published on Sun, 10/04/2020 - 17:35

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మ‌హిళా విద్యార్థికి సాయం చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. విదేశాల్లో పై చ‌దువులు పూర్తి చేయాల‌న్న ఆమె క‌ల‌ను నెర‌వేర్చేందుకు మార్గం సుగ‌మం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన తిగిరిప‌ల్లి శ్రీ చంద‌న తండ్రి 9 ఏళ్ల క్రిత‌మే మ‌ర‌ణించాడు.  చ‌దువులో ఫ‌స్టు ఉన్న‌ ఆమెను ఇంటిస‌భ్యులు నానా క‌ష్టాలు ప‌డి కంప్యూట‌ర్ సైన్స్ వ‌ర‌కు చ‌దివించారు. త‌ర్వాత ఆమె యూకేలోని మాంచెస్ట‌ర్ సిటీలో ఉన్న ప్రముఖ సాల్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాలయంలో చ‌దువుకునేందుకు ఎంపికైంది. అందుకు‌ ఆమె తొలుత ఎగిరి గంతేసినా త‌ర్వాత కుటుంబ ప‌రిస్థితి గుర్తుకు వ‌చ్చి ఆశ‌ల‌ను చంపుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌కాశ్ రాజ్ ఆమెను చ‌దివించేందుకు ముందుకు వ‌చ్చారు. (చ‌ద‌వండి: లక్ష్మీభాయ్‌ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్‌ అయిపోతారా?)

యూకేలో నివ‌సించేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బుతో పాటు ట్యూష‌న్ ఫీజును కూడా అందించారు. ఆయ‌న చేసిన సాయానికి ఉబ్బిత‌బ్బిబైపోయిన చంద‌న కుటుంబంతో స‌హా ప్ర‌కాశ్ రాజ్‌ను క‌లిసి ఆయ‌నకు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఒక తండ్రిగా త‌న‌ను చ‌దివిస్తున్నందుకు ఎంత‌గానో సంతోషించింది. కాగా లాక్‌డౌన్ కాలంలో ఆప‌ద్భాంద‌వుడిగా మారిన న‌టుడు‌ సోనూసూద్‌తో క‌లిసి ప్ర‌కాశ్ రాజ్ కూడా వ‌ల‌స కార్మికుల‌కు త‌న వంతు సాయం అందించి అండ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ 'అల్లుడు అదుర్స్' అనే చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. (చ‌ద‌వండి: అభిమాని కల నెరవేర్చిన అల్లు అర్జున్‌!)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)