amp pages | Sakshi

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బూతులు తిట్టి వెళ్ల‌గొట్టాడు: హ‌నుమాన్ ద‌ర్శ‌కుడు

Published on Mon, 01/15/2024 - 10:57

హ‌నుమాన్ సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు మారుమోగిపోతోంది. సంక్రాంతి బ‌రిలో ఉన్న పెద్ద సినిమాల‌ను వెన‌క్కు నెడుతూ హ‌నుమాన్ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చూస్తుంటే ఈ మూవీ.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హీరో తేజ స‌జ్జ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోనున్న‌ట్లు  క‌నిపిస్తోంది. ఇక‌పోతే ప్ర‌శాంత్ వ‌ర్మ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల‌ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

ఆఫీస్ బాయ్‌లా చూశాడు
ఆయ‌న మాట్లాడుతూ.. ఇంజ‌నీరింగ్ చ‌దువుకునే రోజుల్లోనే షార్ట్‌ఫిలింస్, డాక్యుమెంట‌రీలు చేశాను. నేను అందుకున్న స‌ర్టిఫికెట్ల‌ను ఓ సూట్‌కేసులో పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఛాన్సులిస్తారేమోన‌ని తిరిగేవాడిని. అది చూసిన చాలామంది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని పంపించేశారు. కొన్నిరోజుల‌కు ప‌రిస్థితి అర్థ‌మై అవేమీ లేకుండా తిరిగాను. ఓ సారి ఒక‌రి రిక‌మండేష‌న్‌తో ఓ డైరెక్ట‌ర్‌ను క‌లిశాను. ఆయ‌న ముందు కూర్చున్న రెండు నిమిషాల‌కే రేయ్‌, నీళ్లు తీసుకురారా అన్నాడు.

బూతులు తిట్టారు
ఆఫీస్ బాయ్‌ను పిలుస్తున్నాడేమోన‌ని దిక్కులు చూస్తుంటే నిన్నేరా అన్నాడు. వెంట‌నే నేను కిచెన్‌లో నుంచి నెమ్మ‌దిగా ఆఫీస్‌ బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. ఇది జ‌రిగి దాదాపు తొమ్మిదేళ్ల‌వుతోంది. ఇటీవ‌ల‌ ఆ ద‌ర్శ‌కుడు సాయం కోసం మా ఆఫీస్‌కు వ‌చ్చాడు. ఆయ‌న‌కు నేనెవ‌రో గుర్తులేదు. నేను కూడా గ‌తాన్ని త‌వ్వ‌కుండా త‌న‌కు కావాల్సిన సాయం చేసి పంపించేశాను. ఒక‌సారైతే పెద్ద డైరెక్ట‌ర్‌, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిల‌బడ్డాను. న‌న్ను చూసి.. నీకిక్క‌డ ఏం ప‌నిరా.. వెళ్లిపో అని బూతులు తిట్టారు.

ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోదామ‌నుకున్నా
త‌ర్వాత ఆ వ్య‌క్తే నా భుజంపై చేయి వేసి అంద‌రికీ న‌న్ను మావాడే.. మా వాడే.. అని చెప్పుకుతిరిగాడు. ఇండ‌స్ట్రీలో ఇవి స‌ర్వ‌సాధార‌ణ‌మే కావ‌చ్చు. కానీ నేను త‌ట్టుకోలేక‌పోయాను. చిన్న‌ప్ప‌టినుంచి ఇంట్లో న‌న్ను ఒక్క‌మాట అనేవారు కాదు. ఎవ‌రి ద‌గ్గ‌రా ఒక మాట ప‌డేవాడిని కాదు. అలాంటిది ఇక్క‌డికి వ‌చ్చాక ఎన్నో అవ‌మానాలు భ‌రించాల్సి వ‌చ్చింది. ఒకానొక స‌మ‌యంలో ఈ ఇండ‌స్ట్రీ నాకు క‌రెక్ట్ కాదు, వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ నిల‌దొక్కుకున్నాను అని చెప్పుకొచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)