amp pages | Sakshi

ప్రియమణి కొత్త రూపం.. 'భామా కలాపం'

Published on Wed, 01/12/2022 - 19:50

Priyamani Telugu Movie Bhama Kalapam In AHA: 2003లో ఎవరే అతగాడు చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైంది ప్రియమణి. తర్వాత ఫ్యామిలీ హీరో జగపతి బాబు నటించిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో ప్రేక్షకులకు చేరువైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ'తో ఇక చెరిగిపోని ముద్ర వేసుకుంది ప్రియమణి. అనంతరం అనేక సినిమాల్లో నటించిన ఈ కేరళ బ‍్యూటీ తెలుగులో కొంతకాలం కనుమరుగైపోయింది. ఇటీవల ఎంతో పాపులర్‌ అయిన హిందీ వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌'తో ఆకట్టకుంది. ఇదే కాకుండా ప్రముఖ తెలుగు రియాల్టీ డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు, అభిమానులకు మళ్లీ చేరువైంది. 

తాజాగా ప్రియమణి కొత్త రూపం ఎత్తింది. 'భామా కలాపం' అనే వెబ్‌ చిత్రంలో నటించి మరోసారి నటిగా తానేంటో చూపించనుంది. అభిమన్యు తాడిమేటి కథ, దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి టైటిల్‌ రోల్‌లో అలరించనుంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలు పట్టుకుని ఆకట్టుకుంటోంది. గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూనే తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కుందో ఈ సినిమా ద్వారా చూపించనున్నట్లు సమాచారం. 
 

ఇదీ చదవండి: తెలుగు ఇండియన్‌ ఐడల్ జడ్జ్‌గా తమన్‌ !

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)